సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించాలి : కేటీఆర్

-

తెలంగాణ బిడ్డ అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారని.. అందుకే  సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటే విధంగా కేటీఆర్ సచివాలయం నిర్మాణం చేపట్టారు. పాత సచివాలయం అస్థవ్యస్థంగా ఉండేది. సచివాలయానికి ప్రమాదం జరిగినా ఫైర్ ఇంజిన్ వెళ్లే పరిస్థితి కూడా లేదన్నారు.

తెలంగాణలో శంషాబాద్ విమానాశ్రయానికి, ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి ఇలా చాలా వాటికి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అయినా పదేళ్ల మా పాలనలో పేరు మార్చలేదు. మరో నాలుగేళ్లలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. కచ్చితంగా రాజీవ్ గాంధీ పేరును మార్చుతామని తెలిపారు. కర్ణాటక, తమిళనాడు ఇలా పలు రాష్ట్రాలలో ఆ రాష్ట్రానికి సంబంధించిన వారి విగ్రహాలు ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ది తెచ్చుకొని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version