ఇప్పుడే కత్తి తీసి…యుద్ధంలో దిగా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు. అందరూ అనుకుంటున్నట్లుగా తాను సౌమ్యుడిని కాదని బీజేపీ చీఫ్ రామచందర్ రావు వెల్లడించారు. విద్యార్థులతో కలిసి పోరాడి 14 సార్లు జైలుకు వెళ్లొచ్చానని స్పష్టం చేశారు. నక్సలైట్లను అరెస్టు చేయాలని పోరాడే సమయంలో తన చేయి విరిగిందని చెప్పారు.

అగ్రెసివ్ అంటే గుండీలు విప్పుకొని తిరగడం కాదని సిద్ధాంతం కోసం పోరాడటం అని పేర్కొన్నారు. యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఇప్పుడే కత్తి బయటకు తీశాను అంటూ సంచలన కామెంట్లు చేశారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తానని వెల్లడించారు. క్రిమినల్ కేసులు పెట్టి జైళ్లో వేయిస్తా… నేను క్రిమినల్ అడ్వొకేట్. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టి జైళ్లో వేయిస్తా అంటూ వెల్లడించారు.