ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉంటానని తెలియజేశాడు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం దిశగా తీసుకువెళ్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

తల్లికి వందనం కోసం రూ. 10 వేల కోట్లను కేటాయించాం. వచ్చేనెల 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ప్రారంభిస్తాం. త్వరలోనే నిరుద్యోగ భృతి డబ్బులు అందిస్తాం. సమాజంలో పేదరికం లేకుండా చేసేందుకు పీ4 అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీంతో ఏపీ వాసులు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.