హైదరాబాద్ లో బోనాల పండుగ హడా విడి జోరుగా కొనసాగుతోంది. అయితే… మొదటి రోజు మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు..ప్రశాంతంగా ముగిశాయి. నిన్న తెల్లవారు జామున ప్రభుత్వం తరుపున మొదటి బోనం సమర్పించడంతో ప్రారంభమై అమ్మవారి బోనాల ప్రక్రియ కొనసాగుతోంది.
లక్షలాది భక్తుల మొక్కులు, వేలాది బోనాల సమర్పణ తో అంగరంగ వైభవంగా కొనసాగాయి మహంకాళి బోనాలు. పోత రాజుల ఆటపాటలతో ఫలహారం బండి ఊరేగుంపులతో ఈ రోజు తెల్లవారు జామున తొలి రోజు బోనాల సంబరాలు..ముగిశాయి.
మహంకాళి ఆలయంలో భక్తుల రద్దీ..రెండో రోజు కొనసాగుతోంది. వడి బియ్యం, చీరా సారెలతో అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు భక్తులు. రంగం భవిష్యవాణి, ఏనుగు అంబారీ పై అమ్మవారి ఊరేగింపుతో ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతర నేడు ముగియనుంది. పచ్చి కుండ పై నిలబడి జోగినీ చెప్పే భవిష్యవాణి పై భక్తులలో ఆసక్తి నెలకొంది. ఇక ఇవాళ ఉదయం 9 గంటల తరువాత రంగం భవిష్యవాణి ఉండే అవకాశం ఉంది.