తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ఈనెల 30వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ర్యాపిడ్ సంస్థ ఓవినూత్న కార్యక్రమం చేపట్టింది.
పోలింగ్ రోజున 2,600 పోలింగ్ బూత్‌లకు ఉచిత రైడ్‌లను అందించనున్నట్లు ర్యాపిడో ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికిపైగా పోలింగ్ నమోదవుతుంటే గ్రేటర్‌లో మాత్రం 55 శాతానికి మించడం లేదని ర్యాపిడో తెలిపింది. ఈ క్రమంలోనే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తమ వంతు కృషి చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించింది.
“ర్యాపిడో కెప్టెన్లంతా ఈ నెల 30న ఉదయం నుంచే సిద్ధంగా ఉంటారు. ఓటర్లు రైడ్ కోరిన వెంటనే వారిని పోలింగ్ బూత్‌ల వద్ద ఉచితంగా దిగబెడతారు. హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం పెరగాలన్న లక్ష్యంతో చిన్న ప్రయత్నంతో ముందుకెళ్తున్నాం. ఓటర్లంతా ఈ సేవలను వినియోగించుకోవాలి అని’’ ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి కోరారు.
ఫ్రీ రైడ్ ఎలా పొందాలంటే..:
- పోలింగ్ జరిగే 30న ర్యాపిడో యాప్‌లో ఉచిత రైడ్ సేవల వినియోగంపై వివరాలు ఉంటాయి.
- పోలింగ్ బూత్ ఎక్కడుందో టైప్ చేెయాలి.
- ఆ తర్వాత అప్లై కూపన్ కోడ్ ఉన్న చోట ‘వోట్ నౌ’ అనే వన్ టైమ్ కోడ్‌ను నమోదు చేస్తే ఉచిత రైడ్ బుక్ అవుతుంది.