జేఎన్టీయూ క్యాంటీన్‌లో చట్నీలో ఎలుక

-

సాధారణంగా చట్నీలో మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వంటి తాళింపు గింజలుంటాయి. కరివేపాకు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఎలుక దర్శనమిచ్చింది. ఈ ఘటన సంగారెడ్డి జేఎన్టీయూ కళాశాల క్యాంటీన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మూత సరిగా పెట్టకపోవడంతో చట్నీ గిన్నెలో పడిన ఎలుక బయటికెళ్లుందుకు అటు ఇటు పరిగెత్తిన వీడియోలు వైరల్‌ అయ్యాయి.

ఇటీవల ఆహారంలో పురుగులు, ఎలుకలు, బల్లులు దర్శనమిస్తున్న ఘటనలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యంపై విద్యార్థులు ధ్వజమెత్తుతున్నారు. కిచెన్‌ పరిశుభ్రంగా ఉంచకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ స్పందించారు. అయితే ఎలుక తినేందుకు ఉంచిన గిన్నెలో కాకుండా.. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో పడిందని ఆయన స్పష్టం చేశారు. పాత్రలో ఉన్న ఎలుకను వీడియో తీసి వైరల్‌ చేశారని ప్రిన్సిపల్‌ నరసింహ తెలిపారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version