గడిచిన 174 ఏళ్లలో ఏ జూన్ నెలలోనూ లేనంత ఉష్ణోగ్రత ఈ ఏడాది నమోదైనట్లు నాసా, NOAA ప్రకటించాయి. 20వ శతాబ్దిలో భూమిపై సగటు ఉష్ణోగ్రత 15.05 సెల్సియస్ డిగ్రీలు కాగా…ఈ జూన్ నెలలో 1.05 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయింది. ఇలా ఏకంగా 1 డిగ్రీని మించి నమోదు కావడం ఇదే తొలిసారి.
ఎల్ నినో వల్లనే ఉష్ణోగ్రత పెరిగిందని నాసా పేర్కొంది. దీనివల్ల సముద్ర జలాలు వేడెక్కి ప్రపంచ వాతావరణాన్ని మారుస్తుందని తెలిపింది. కాగా, నైరుతి రాకతోనూ తెలంగాణలో అంతగా వర్షాలు కురవడం లేదు. గతేడాదితో పోలిస్తే జూన్, జులైలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న గుడ్ న్యూస్ చెప్పారు. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఈ నెల 16న గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఇది తీవ్రమైతే ఈ నెల 18 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు చెప్పారు.