తెలంగాణ నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. మరో ఆరు వేల మంది ఉపాధ్యాయ నియామకాలు చేయబోతున్నట్లు ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భవిష్యత్ లో ఈ నియామకాలు….ఉంటాయన్నారు. రాజకీయ..ఆర్థిక..సామాజిక అవకాశాలు సమానం గా అందాలని తెలిపారు. అందుకే సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
అటు డ్వాక్రా సంఘాల మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున అందిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి… డ్వాక్రా సంఘాల మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటన చేశారు. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి లో అంబానీ, ఆదానీలే కాదు.. తెలంగాణ మహిళలను సోలార్ ప్లాంట్స్ ఏర్పాటులో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారవేత్తలుగా మారడంలో తెలంగాణ దేశానికే మోడల్ కాబోతోందని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.