వరంగల్‌లో రీజినల్ ఎయిర్‌పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం ఆదేశం

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ లో రీజినల్ ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎయిర్ స్ట్రిప్ కు అదనంగా 400 ఎకరాలు కావాలని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోరింది.

తొలి విడతగా చిన్న విమానాలు ఎగిరేందుకు వీలుగా 253 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ భూములు ఉండటంతో… భూముల సేకరణలో ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కాగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన సీఎం కేసీఆర్ అనూహ్యంగా కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈటల బర్తరఫ్ తో ఖాళీ అయిన స్థానాన్ని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో భర్తీ చేయనున్నట్లు సమాచారం. గవర్నర్ ఆమోదిస్తే రేపు ఉదయం 11:30 గంటలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version