రైతులకు గుడ్ న్యూస్.. సాగర్ నుంచి సాగునీరు విడుదల

-

గత కొద్ది రోజుల నుంచి  కృష్ణమ్మ పరుగెడుతున్న విషయం తెలిసిందే. ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్ట్ నిండు కుండలా కనిపిస్తున్నాయి. గత మూడు రోజుల కిందటే శ్రీశైలం గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లోకి నీరు చేరింది. మూడు రోజుల నుంచి వస్తున్న వరద సాగర్ నిండు కుండలా కనిపిస్తోంది. దీంతో తాజాగా నాగార్జున ప్రాజెక్ట్ కు సంబంధించిన గేట్లను ఇవాళ ఎత్తారు. 

నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేశారు. శుక్రవారం  కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు. ఇప్పటికే కుడి కాలువ ద్వారా 5,944 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీశైలం జలాశయం నుంచి భారీ వరద నీటి రాకతో సాగర్ ప్రాజెక్ట్ లో నీటి మట్టం క్రమంగా పెరుగుతుండగా ఎడమ కాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఎప్పుడైతే సాగర్ గేట్లు ఎత్తుతారని ప్రభుత్వం ప్రకటించిందో అప్పటి నుంచి చూడాలని ప్రజలు ఎంతో ఆసక్తి ఎదురుచూశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version