Real Estate : ఆ తెలంగాణ ఊరిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసారంటే కోట్లు రాలడం పక్కా!

-

తెలంగాణలోని ముచ్చెర్ల ప్రాంతాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో డెవలప్ చెయ్యడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ముచ్చెర్లను ఇంటర్నేషనల్ హబ్ గా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మెడికల్ అండ్ హెల్త్ హబ్ ఇంకా అగ్రికల్చర్ హబ్ వంటివి ఏర్పాటు చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. క్రీడలు, ఐటీ, పరిశ్రమలు ఇంకా ఎనర్జీ వంటి వాటిపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. ఈ రంగాలన్నీ కూడా తెలంగాణ ఆర్థికాభివృద్ధికి సాహసం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.

ముఖ్యంగా యువతను డ్రగ్స్, మత్తు పదార్ధాలు వంటి వాటి నుంచి దూరం చేసేలా స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. 200 పైగా ఎకరాల్లో గోల్ఫ్ క్లబ్ సిద్ధం చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా అలాగే 200 ఎకరాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ని సిద్ధం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలోకి వచ్చేలా మెట్రో రైలుతో ముచ్చెర్ల ప్రాంతాన్ని లింక్ చేయాలని భావిస్తున్నారు. ఇంకా అలానే ముచ్చెర్లలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించే ఆలోచనలో ఉన్నారు.

దాదాపు నాలుగు వేల పైగా ఎకరాల్లో ముచ్చెర్లను అంతర్జాతీయ ప్రమాణాలతో మహా నగరంగా మార్చి వైద్య సేవలతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిపించాలని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతం డెవలప్ కాబోతోంది కనుక అక్కడ పెట్టుబడి పెడితే కచ్చితంగా భారీ లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఏరియాలో చదరపు అడుగు స్థలం ధర దాదాపు రూ. 900 దాకా ఉంది. సపోజ్ ఒక గజం రూ. 10 వేలు అనుకున్నా గానీ ఒక పాతిక లక్షలు పెట్టుబడి పెడితే 300 గజాల వరకు స్థలం వస్తుంది.

ఇప్పుడు గజం 10 వేలు ఉంటే డెవలప్ అయ్యాక 60 వేలు నుంచి లక్షకు కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు అక్కడ ఒక 25 లక్షల పెట్టుబడి పెట్టినా కానీ భవిష్యత్తులో కోట్లు పలికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి తక్కువ పెట్టుబడితో భారీగా సంపాదించాలి అనుకునేవారికి ఇది నిజంగా సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version