టెట్ అభ్యర్థులకు ఊరట.. షెడ్యూల్ లో మార్పులు..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్దమవుతున్న ప్రభుత్వం అంతకుముందే మరోసారి టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే షెడ్యూల్ తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఆ తరువాత అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు పరీక్షలకు 90 రోజుల సమయం ఇవ్వాలనే కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా షెడ్యూల్ లో కీలక మార్పులు చేస్తూ.. ప్రకటన చేసింది.

అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇక అక్టోబర్ 4 నుంచి కీ విడుదల చేయనున్నట్టు, తుది ఫలితాలను నవంబర్ 2న  విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక రెండన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వచ్చే నెల 8 వరకు పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లించవచ్చునని, ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించేందుకు ఆగస్టు 3 వరకు గడువు ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 19 నుంచి ఆన్ లైన్ లో మాక్ టెస్టులు నిర్వహిస్తారు. జులై 22 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version