భువనగిరి సబ్ జైలు నుంచి ఓ రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. ఈనెల 22న రిమాండ్ లో ఖైదీని జైలు సిబ్బంది వైద్య పరీక్షల నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే ఈ తరుణంలోనే పోలీసుల కళ్లు కప్పి ఆ ఖైదీ అక్కడి నుంచి సైలెంట్ పరార్ అయ్యాడు.
అయితే.. ఈ విషయం ఎక్కడా బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించారు పోలీసులు. అనంతరం రిమాండ్ ఖైదీని తిరిగి పట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా భువనగిరి సబ్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో పోలీసుల అజాగ్రత్త పై పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లిన ఖైదీ పై నిరంతరం నిఘా పెట్టాల్సిన సిబ్బంది అసలు ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.