తెలంగాణ రాష్ట్ర అధికారిక వెబ్ సైట్ నుంచి తెలంగాణ చరిత్ర పేజీ తొలగిచింది రేవంత్ సర్కార్. తెలంగాణ రాష్ట్ర అధికారిక వెబ్ సైట్ http://telangana.gov.in నుంచి History (తెలంగాణ చరిత్ర) పేజిని CMO ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల తొలగించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
నెల రోజుల క్రితం CMO మరియు, I&PR రెండు యూట్యూబ్ చానల్స్ నుండి గత ప్రభుత్వానికి సంబంధించిన వందలాది వీడియోలు తొలగించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ చరిత్రను అసత్యాలతో తిరగరాసే కుట్ర రేవంత్ సర్కార్ మొదలుపెట్టింది అని తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ అధికారిక చిహ్నం మారుస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి, వాహన రిజిస్ట్రేషన్ అక్షరాలు TS నుండి TG గా మార్చిన విషయం తెలిసిందే.