రైతులు నష్టపోవడానికి రేవంత్ సర్కార్ వైఫల్యమే కారణం.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

-

ప్రభుత్వ తీరు పట్ల మాజీ మంత్రి హరీష్ రావు  ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 322 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. ఆచరణలో ఇప్పటి వరకు ఒక్క రైతు దగ్గర కూడా పత్తి కొనుగోలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం.. పత్తి మద్దతు ధర క్వింటాల్ కి రూ.7521తో పాటు, రూ.500 బోనస్ కలిపి రూ. 8021 కొనుగోలు చేయాల్సింది. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు 5వేలకే అమ్ముకునే దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.

అకాల వర్షాల వల్ల దిగుబడి తగ్గిపోయి ఎకరానికి నాలుగు క్వింటాళ్ల పత్తి కూడా పండలేదని.. గోరు చుట్టు మీద రోకటి పోటులా దిగుబడి తగ్గడంతో పాటు తక్కువ ధరకు అమ్ముకొని పత్తి రైతులు దారుణంగా నష్టపోతున్నారంటే ఇది పూర్తిగా రేవంత్ సర్కారు వైఫల్యమే అని తెలిపారు. వరి కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు రాలేదు. ఏ ఊరు ధాన్యం ఏ మిల్లుకు పోవాలో ఒప్పందం జరగలేదు. ధాన్యం రవాణా ఏర్పాట్లకు కూడా దిక్కులేదు. ప్రభుత్వం కట్టాలని చెప్పిన ఎర్ర రంగు సుతిలి దారం గానీ, పచ్చ రంగు సుతిలి దారం గానీ కొనుగోలు కేంద్రాలకు చేరిన దాఖలాలు లేవన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version