తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన

-

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డా.బీ.ఆర్. అంబేద్కర్ పేరుతో సచివాలయం నిర్మాణం చేపడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం నూతన అసెంబ్లీ భవనాన్ని నిర్మించనుంది. ఇందుకు సంబంధించి తాజాగా రోడ్లు అండ్ భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ కీలక ప్రకటన చేశారు.

అసెంబ్లీ అఘాఖాన్ ట్రస్ట్ రూ.49 కోట్ల అంచనా వ్యయంతో రెనోవెట్ చేయనున్నట్టు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఉండే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన పనులను మరో మూడు నెలల్లోనే పూర్తి చేస్తామని తెలిపారు. నిజాం కాలంలో అసెంబ్లీని ఎలా నిర్మించారో.. తాము అలాగే మార్పులు చేయనున్నట్టు తెలిపారు కోమటిరెడ్డి. దీంతో తెలంగాణ పలు మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version