టీఆర్ఎస్ పార్టీ రోడ్లపైన, జాతీయ రహదారులపై టెంట్లు వేసి మీడియాకు ఫోజులు ఇస్తే పోలీసులకు మాత్రం ఇది ఎక్కడ కనిపించలేదని… ప్రజల తరుపున మేం నిరసన తెలుపుదాం అంటే కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారని విమర్శించారు. మేమేమైనా పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చామా…? అంటూ ప్రశ్నించారు. మేం ప్రజాప్రతినిధులం ప్రజల తరుపున పోరాడుతున్నామని… ప్రజాస్వామ్యంలో నిరసన ఓ భాగం అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొంట లేదని అంటున్న కేసీఆర్.. వడ్లు కొనాలని కాంగ్రెస్ రైతులకు అండగా నిలబడాలని భావిస్తే కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
మేమేమైనా పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చామా..? టీఆర్ఎస్ ఓ నీతి మాకో నీతా..?: ప్రభుత్వం తీరుపై రేవంత్ రెడ్డి
-