వచ్చే ఎన్నికల్లో కొడంగల్​ నుంచే పోటీ చేస్తా : రేవంత్ రెడ్డి

-

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను కొడంగల్‌ నుంచే పోటీచేస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన…. స్థానికంగా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డిని కలిశారు. అనంతరం, నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమై పోటీ అంశంపై చర్చించారు. టికెట్‌ కోసం తన తరఫున కొడంగల్‌ కాంగ్రెస్‌ నేతలు ఇవాళ గాంధీభవన్‌లో దరఖాస్తు అందజేస్తారని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే కేసీఆర్​ ఆపద మెక్కులు మొక్కుతున్నాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నాలుగేళ్లుగా పట్నం మహేందర్‌ రెడ్డికి అపాయిట్‌మెంట్‌ ఇవ్వని కేసీఆర్‌…. ఓట్ల కోసం మంత్రిని చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్‌.. డబ్బు, మద్యం, దౌర్జన్యాన్ని నమ్ముకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ శ్రేణులు కేసీఆర్​ను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

మరోవైపు ఈ నెల 26వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రజాగర్జన సభ జరగనుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరై ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటిస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version