తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తోందట రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 వేలకు పైగా గ్రామపంచాయతీలు ఉన్నాయి. కెసిఆర్ ప్రభుత్వంలోని కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. తాండాలను కూడా గ్రామపంచాయతీలు చేసి.. డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేసింది కేసీఆర్ సర్కార్.
అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది తమ గ్రామాలను…. గ్రామ పంచాయతీ చేయాలని డిమాండ్ వినిపిస్తూనే ఉన్నారు. అలా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుపై డిమాండ్ వినిపిస్తోందట. అయితే త్వరలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… కొత్తగా 200 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయాలని ఏ రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కొత్తగా 200 గ్రామపంచాయతీలు అయితే… కొత్తగా మండలాలు కూడా ఏర్పాటు అవుతాయి.