టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ కు తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో…. అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వకూడదని… పోలీసులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని నాంపల్లి కోర్టును కోరారు తెలంగాణ పోలీసులు. అల్లు అర్జున్ డబ్బు అలాగే పలుకుబడి ఉన్న వ్యక్తి అని… అలాంటి వ్యక్తులు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే.. ప్రమాదం ఉంటుందని నాంపల్లి కోర్టు ముందు పోలీసులు విన్నవించారట.
రెండు వారాల కిందట పోలీస్ స్టేషన్లో సహకరించకపోవడంతోనే అల్లు అర్జున్ అరెస్టు చేశామని పోలీసులు తెలిపారట. అలాంటి వ్యక్తి ఇప్పుడు బయటికి వస్తే…. సాక్షి లను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుందని నాంపల్లి కోర్టుకు పోలీసులు తెలిపారట. మరి దీనిపై నాంపల్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉండగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ సంఘటనలో అల్లు అర్జున్ పైన కేసు నమోదు కాగా… అతన్ని రెండు వారాల కిందట అరెస్టు కూడా చేశారు.