కేసీఆర్‌, మల్లారెడ్డి కలిసి మేడ్చల్‌లో భూములను కబ్జా చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రచారం ముమ్మరం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ మేడ్చల్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని జవహర్ నగర్ నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్​లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జవహర్‌నగర్‌కు కేసీఆర్‌ ఇచ్చింది డంపింగ్‌ యార్డ్ అని.. దాన్ని తరలించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇంతవరకూ తరలించలేదని అన్నారు. కేసీఆర్‌, మల్లారెడ్డి కలిసి మేడ్చల్‌లో భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.

మేడ్చల్‌కు తెస్తామన్న ఐటీ పార్క్‌ ఎక్కడికి పోయింది. రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ప్రతినెలా రూ.2,500 ఇస్తాం. అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే సిలిండర్‌ ఇస్తాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌.. ఉపాధి హామీ పనికి వెళ్లే ప్రతి ఒక్కరికీ రైతుబంధు కింద రూ.12 వేలు.. కాంగ్రెస్‌ గెలిస్తే.. పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. విద్యార్థులకు యువవికాసం కింద రూ.5 లక్షలు ఇస్తాం. అని రేవంత్ రెడ్డి తెలిపారు.

పేదలు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. పేదల ఇంట్లో ఆడపిల్ల పెళ్లికి రూ.లక్ష నగదు, తులం బంగారం అందజేసి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. తెలంగాణను ఆగమాగం చేసింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ముదిరాజ్‌లకు ఒక్కసీటు కూడా కేసీఆర్‌ ఇవ్వలేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version