ఎల్లుండి అమిత్ షా చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. బిజెపి మేనిఫెస్టోలో పేదలకు సంబంధించిన అంశాలు ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. మోడీ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రతి వ్యక్తికి జీవిత భీమా, ఆయుష్మాన్ భారత్ కింద పది లక్షల వరకు ఉచిత వైద్యం, వరి క్వింటాల్కు 3100 రూపాయలు, పంటలబీమా పథకం అమలు లాంటి అంశాలను చేర్చనుంది బీజేపీ పార్టీ.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ల ఏర్పాటు, పెళ్లైన ప్రతి మహిళలకి సంవత్సరానికి 12 వేల రూపాయలు, సిలిండర్ 500 రూపాయలకే, తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేసేలా బిజెపి మేనిఫెస్టో సిద్ధం కానున్నట్లు సమాచారం. అలాగే… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జమ ఔషధీ కేంద్రాలు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 20వేల రూపాయలు, యూపీఎస్సీ మాదిరిగానే టీఎస్పీఎస్సీ పరీక్షలు జాబ్ క్యాలెండర్ లాంటి అంశాలు బిజెపి మేనిఫెస్టో లో ఉండనున్నాయి.