BREAKING : ప్రస్తుతం ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇవాళ అధిష్టానం పెద్దలు ఖర్గే, సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్ తదితరులతో రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. నిన్న అర్థరాత్రి దాటే వరకు రేవంత్ రెడ్డి భేటీలు కొనసాగాయి.
అటు ఢిల్లీ చేరుకున్న వెంటనే నేరుగా డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. అనంతరం మాణికం టాగోర్‌ను కలిసారు రేవంత్ రెడ్డి. అలాగే.. రేపు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అధిష్టాన పెద్దలను రావాల్సిందిగా ఆహ్వానించే అవకాశం ఉంది. అంతేకాకుండా మంత్రివర్గం కూర్పు పై ఇవాళ అధిష్టాన పెద్దలతో కీలక మంతనాలు చేయనున్నారు రేవంత్ రెడ్డి.
కాగా, తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. సీఎల్పీగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అగ్రనాయకత్వం దిల్లీలో ప్రకటించింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీ గురువారం రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.