రేపు విశాఖకు రానున్న పవన్ కళ్యాణ్

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ విశాఖ టూర్‌ ఫిక్స్‌ అయింది. రేపు విశాఖకు రానున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన చేసింది. ఇక ఈ సందర్భంగా జనసేన పార్టీలో చేరికల కోసం బహిరంగ సభ నిర్వహించనున్నారు. AS రాజా గ్రౌండ్లో సభ కోసం పరిశీలిస్తోంది జనసేన పార్టీ నాయకత్వం. అలాగే… తుఫాన్ వాతావరణం అనుకూలిస్తే పవన్ పర్యటన ఖరారైయ్యే అవకాశం ఉంది.

pawan kalyan to visakha

కాగా, తుఫాన్‌ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్ర తుపాను ముంచుకొస్తోంది.. అప్రమత్తత అవశ్యం…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంపై మిచౌంగ్ తుపాను తీవ్ర ప్రభావం చూపించబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి…ఇది తీవ్ర తుపాను అని రెడ్ అలెర్ట్ కూడా ఇచ్చారని వెల్లడించారు పవన్ కళ్యాణ్. తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలి…తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయక చర్యల్లో జనసేన నాయకులు, శ్రేణులు పాలుపంచుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version