బీఆర్ఎస్ వాళ్లు మా కాళ్లలో కట్టె పెట్టాలి అనుకుంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ల కండ్లలో కారం కొడుతారని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ పథకం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు.
దొడ్డు బియ్యం పేరుతో ప్రతి ఏటా రూ.10 వేల కోట్ల స్కామ్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.10కి కొన్ని మళ్లీ రూ.30 రూపాయలకు మిల్లర్లు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.. ఈ సైక్లింగ్ వ్యవస్థను చూసే పేదలకు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన చేశామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలిపోయినందుకు కేసీఆర్ కుటుంబాన్ని ఉరి వేసినా తప్పు లేదన్నారు రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ వాళ్లు మా కాళ్లలో కట్టె పెట్టాలి అనుకుంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ల కండ్లలో కారం కొడుతారు – రేవంత్ రెడ్డి pic.twitter.com/OjEfBnx55w
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2025