మాంస ప్రియులకు బిగ్ షాక్. చికెన్ ధరలు భారీగా పెరిగాయి. రంజాన్ పండుగ నేపథ్యంలో ఈ రోజు అంటే సోమవారం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తదితర నగరాల్లో కిలో చికెన్ రూ.280-300 వరకు విక్రయిస్తున్నారు.
బర్డ్ ఫ్లూ వ్యాప్తి, భయంతో చికెన్ కొనుగోళ్లు గత వారం వరకు కిలో చికెన్ రూ.150కే అమ్మారు. తాజాగా చికెన్ ధరలు పెరగడంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని కోరారు సీఎం రేవంత్.
రంజాన్ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీక అన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.