భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ పథకం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. దొడ్డు బియ్యం పేరుతో ప్రతి ఏటా రూ.10 వేల కోట్ల స్కామ్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రూ.10కి కొన్ని మళ్లీ రూ.30 రూపాయలకు మిల్లర్లు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.. ఈ సైక్లింగ్ వ్యవస్థను చూసే పేదలకు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన చేశామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.