సిఎస్ రామకృష్ణరావు పదవి కాలం పొడిగింపు కోసం సీఎం రేవంత్ డిఓపిటికి లేఖ రాసినట్లుగా సమాచారం అందుతుంది. ఈనెల చివరి వరకు రిటైర్ ఇవ్వాల్సిన రామకృష్ణ రావు పదవిని మరో ఆరు నెలలు కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లుగా తెలుస్తోంది. పైగా కొత్త సిఎస్ నియామకం కోసం ప్రభుత్వం కసరత్తు చేయడం లేదని సమాచారం అందుతుంది.
ఈ పదవి కోసం జయేశ్ రంజన్, వికాస్ రాజ్, శశాంక్ గోయల్ తో పాటుగా పలువురు సీనియర్ ఐఏఎస్ లు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా… తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో చదివే విద్యార్థులకు శుభవార్త అందజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి జిల్లాలో టాపర్లుగా నిలిచిన ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయిలకు రూ. 10,000 చొప్పున డబ్బులను ఇవ్వనున్నారు.