సీఎం ప్రమాణ స్వీకారం తరువాత రేవంత్ రెడ్డి తొలి ట్వీట్..!

-

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా మొత్తం11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత  తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను తప్పక అమలు పరిచే అభయ హస్తంపై తొలి సంతకం చేశారు.

సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ ట్విట్టర్ వేదికగా  ఆసక్తికర పోస్ట్ చేశారు . తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది అన్నారు. బానిసత్వం బద్దలయ్యాయని తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందని తెలిపారు. సామాజిక, న్యాయం, సమాన అభివృద్ధి తో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుందన్నారు. పేదల ముఖాలు వెలుగులు వెల్లులిస్తాయన్నారు. హక్కుల రెక్కలు విచ్చుకుంటున్నారు. నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి అన్నారు. ఇది మీ అన్న ఇస్తున్నమాట అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version