ప్రధాని నరేంద్ర మోడీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. విభజన చట్టం, పార్లమెంట్ వేదికగా తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం… ఎనిమిదేళ్లుగా తెలంగాణకు జరుగుతోన్న అన్యాయం గురించి లేఖ రాశారు రేవంత్ రెడ్డి. లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు పై నిర్లక్ష్యం వహించడం… ఏర్పాటు సాధ్యం కాదని తేల్చేయడం తెలంగాణ యువతకు నిరాశను మిగిల్చిందని..కాజీపేట ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దశాబ్దాల కల. ఈ మేరకు విభజన చట్టం షెడ్యూల్ 13లో, 10వ అంశంగా పేర్కొన్నారు. ఈ హామీ అటకెక్కించారని ఫైర్ అయ్యారు.
తెలంగాణలో 12 శాతం గిరిజనులు ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు చట్టం హామీ ఇచ్చింది. ఇప్పటికీ ఏర్పాటుకు చొరవ లేదని.. పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో చేర్చిన సంస్థలు, ఆస్తులు విభజన కొలిక్కి రాలేదని పేర్కొన్నారు. రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు హామీ ఇంకా పరిపూర్ణం కాలేదు. పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రత్యేక ఇన్సెంటివ్ లు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని.. తెలంగాణకు దక్కాల్సిన ఐఐటీ, ఐఐఎం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐఐటీ వంటి ఒక్క ఉన్నత విద్యా సంస్థ కూడా మంజూరు కాలేదు. ఇతర హామీలు అన్నారు. హైదరాబాద్ ఐటీ పరిశ్రమను శిఖర స్థాయికి చేర్చే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రకటించిన ITIR (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్టిమెంట్ రీజియన్) ప్రాజెక్టును మీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేశారు. దీని వల్ల లక్షలాది మంది యువత ఉపాధి దొరికే అవకాశం కోల్పోయారని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.