రేవంత్ రెడ్డి ప్రతినిధిని కొట్టారు అంటే రేవంత్ రెడ్డిని కొట్టినట్టే : జగదీశ్ రెడ్డి

-

రేవంత్ రెడ్డి ప్రతినిధిని కొట్టారు అంటే రేవంత్ రెడ్డిని కొట్టినట్టే అని రేవంత్ రెడ్డి కొడంగల్ పోయి ఉంటే వీపు ఇంకా ఎక్కువ చింతపండు చేస్తుండే అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా మీడియా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముంచి పోవడానికి వచ్చాడు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ మాత్రం ప్రేమ లేదని కాంగ్రెస్ కార్యకర్తలే నాతో అంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త బాధపడుతున్నాడు.

దేశ చరిత్రలో ఒక ఏడాది కాలంలో 25 సార్లు కాళ్ళు పట్టుకోడానికి ఢిల్లీకి పోయిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  నోటుకు ఓటు కేసులో బయట పడేయమని రేవంత్ రెడ్డి 25 సార్లు ఢిల్లీకి పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు.  రేవంత్ రెడ్డి పగటి పూట రాహుల్ గాంధీ కాళ్ళు, రాత్రిపూట మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు. పంట ధరలు పడిపోవడానికి, రైతాంగం నష్టపోవడానికి రాష్ట్ర మంత్రులే కారణం. కొంత మంది మంత్రులు దళారుల దగ్గర, మిల్లర్ల దగ్గర వందల కోట్ల డబ్బులు వసూలు చేసి, గొర్రెను కసాయి వాడికి అమ్మినట్టు రైతులను అప్పగించారు

Read more RELATED
Recommended to you

Latest news