ఈటెల రాజేందర్ పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

-

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీభవన్లో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న రాజకీయ విష ప్రచారంలో ఈటల కూడా పాత్రధారేనని కీలక ఆరోపణలు చేశారు.

ఎన్నికల్లో బందుల కోట్లు ఖర్చు పెట్టే సాంస్కృతి ఈటలకు ఇష్టం లేదని.. కానీ హుజురాబాద్ ఉప ఎన్నికలలో వందల కోట్లు ఈటెల ఖర్చు పెట్టారని ఆరోపించారు. మునుగోడు లో ఈటెల చేతుల మీది నుండే ఖర్చు పెట్టించారని వ్యాఖ్యానించారు. కెసిఆర్ ని దారిలోకి తెస్తానన్న ఈటెల.. ఇప్పుడు కెసిఆర్ దారిలోనే వెళుతున్నారని అన్నారు. ఈటెల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు నమ్మిన సిద్ధాంతం వైపు నడవాలని సూచించారు.

మీ లక్ష్యం నెరవేరే వైపు నడవాలని అన్నారు రేవంత్ రెడ్డి. బిజెపి ఎన్ని సర్వేలు చేసుకున్నా పది సీట్లు మాత్రమే వస్తున్నాయన్నారు. మునుగోడు లో రాజగోపాల్ రెడ్డికి పడ్డ ఓట్లు బిజెపి ఓట్లు కాదన్నారు. కెసిఆర్ ని గద్దదించాలని ఈటెల చేసిన ప్రయోగం విఫలమైందన్నారు రేవంత్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం అంతా పార్టీ బట్టి విక్రమార్కకు అప్పగించిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version