బీజేపీ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ లో ఉగాది వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీ.. బండి సంజయ్ ఎందుకు రాలేదని నిలదీశారు. సీఎం కెసిఆర్ కి కోపం వస్తుంది అని రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు కిషన్ రెడ్డి.. బండి సంజయ్ హాజరు కాలేదంటూ చురకలు అంటించారు.
కిషన్ రెడ్డి సిటీ లో ఉండి.. కూడా ఎందుకు రాజ్ భవన్ వెళ్ళలేదని నిలదీశారు. గవర్నర్ రాజ్ భవన్ కి కిషన్ రెడ్డి… బండి సంజయ్ కూడా రాలేదని చెప్తే వాస్తవానికి దగ్గర ఉండేది..? అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే గవర్నర్ పై నిందలు వేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం, గవర్నర్ సఖ్యతతో ఉండాలని అన్నారు. గవర్నర్ ఢిల్లీ పర్యటనలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 8ని ఉపయోగించి విశేషాధికారాలను గవర్నర్ ఉపయోగించాలని కోరారు. హైదరాబాద్ డ్రగ్స్ విషయంలో చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.