మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పై సమీక్ష.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

-

వరద ముంపు నుంచి ఖమ్మం ప్రజలకు శాశ్వతంగా విముక్తి కల్పించేందుకు చేపట్టిన మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాజాగా సచివాలయంలో రిటైనింగ్ వాల్ పనుల పురోగతి పై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మున్నేరు ముంపు నుంచి ఖమ్మం పట్టణాన్ని కాపాడేందుకు నదికి ఇరువైపులా ఆర్సీసీ కాంక్రీట్ గోడలు నిర్మిస్తున్నామని తెలిపారు.

ఖమ్మం నగరంలో ముంపునకు అవకావం లేకుండా సరైన మార్గంలో వరద ప్రవాహాన్ని నడిపించేందుకు సరైన డిజైన్ తో వాల్ నిర్మించాలని అధికారులకు సూచించారు. వాల్ నిర్మాణ పనులు మరింత వేగం పెరగాలని.. నెలలో రెండు సార్లు స్వయంగా తానే పర్యవేక్షిస్తానని తెలిపారు. ఈ వాల్ నిర్మాణానికి ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టిలో పెట్టుకొని వాల్ నిర్మించాలని అన్నారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు సౌకర్యం కల్పించేలా దాదాపు 23 కిలోమీటర్ల మేర వరకు వాల్ నిర్మిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేసారు. 

Read more RELATED
Recommended to you

Latest news