సిరిసిల్లలో దారుణం..రాత్రంతా అంబులెన్స్‌లో మృతదేహంతోనే కుటుంబం గడిపింది. గూడు లేక.. అద్దె ఇంటిలోకి వెళ్ళలేక.. రాత్రంతా మృతదేహంతోనే అంబులెన్స్‌లో గడిపింది ఓ కుటుంబం. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన సంతోష్ అనే నేత కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే… సొంత ఇళ్లు లేకపోవడంతో అంబులెన్స్ లోనే మృతదేహంతో రాత్రంతా భార్య శారద, ముగ్గురు పిల్లలు గడిపారు.
అయితే.. ఈ సంఘటన తెలియగానే… సుమారు రూ. 50 వేల వరకు ఫోన్‌పే ద్వారా కుటుంబానికి అందించారు స్థానిక మానవతావాదులు. అటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందించి అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంఛార్జన్ కేకే మహేందర్ రెడ్డి. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది.
గూడు లేక.. అద్దె ఇంటిలోకి వెళ్ళలేక.. రాత్రంతా మృతదేహంతోనే అంబులెన్స్‌లో గడిపిన కుటుంబం..
రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన సంతోష్ అనే నేత కార్మికుడు అనారోగ్యంతో మృతి
సొంత ఇళ్లు లేకపోవడంతో అంబులెన్స్ లోనే మృతదేహంతో రాత్రంతా ఉన్న భార్య శారద, ముగ్గురు పిల్లలు
సుమారు రూ. 50 వేల… pic.twitter.com/wqUHUc9atI
— BIG TV Breaking News (@bigtvtelugu) February 2, 2025