తెలంగాణ రాష్ట్రంలో… బతుకమ్మ పండుగ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ కాకుండా… డబ్బులు మహిళల ఖాతాలలో వేయాలని నిర్ణయం తీసుకుందట.
గులాబీ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు.. సిరిసిల్లలో బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి… వాటిని ప్రజలకు పంచేది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆ చీరలను అందించేది కేసీఆర్ ప్రభుత్వం. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత… సిరిసిల్ల నేతన్నలను రోడ్డున పడేసి.. బతుకమ్మ చీరలకు గుడ్ బై చెప్పింది. ఇక ఇప్పుడు బతుకమ్మ చీరలు స్థానంలో మహిళలకు డబ్బులు ఇవ్వాలని అనుకుంటోoదట. ఈ పథకానికి ఎవరు అర్హులు అనే దానిపైనా త్వరలో సమీక్ష జరపనున్నారట సీఎం రేవంత్ రెడ్డి.