2025 నాటికి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా కేంద్రం : సత్య నాదెళ్ల

-

భారత్‌ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల హైదరాబాద్‌కు వచ్చారు. సత్య నాదెళ్లతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు జరిగిన భేటీలో తెలంగాణలో మైక్రోసాఫ్ట్‌ కార్యకలాపాలు, ఇతర అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌లో రూ.15 వేల కోట్లతో మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటుచేస్తున్న అతిపెద్ద డేటా కేంద్రం 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఈ కేంద్రానికి సంబంధించిన పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. తెలంగాణలో అంకురాలకు, ఐటీ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు.

‘‘ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌ పరివర్తనకు వేదికగా క్లౌడ్‌ ప్లాట్‌ఫారానికి డిమాండ్‌ పెరుగుతోంది. దీనిని పరిగణనలోనికి తీసుకొని సాంకేతికత పరంగా మరింతగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మా సంస్థకు చెందిన అతిపెద్ద డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచం నవీన సాంకేతికతలవైపు పరుగులు తీస్తోంది. ఇందులో తెలంగాణ ముందంజలో ఉంది. ఐటీ రంగంలో రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తోంది. భారతీయులు త్వరలోనే ఐటీలో ఆధిపత్యం వహించే స్థాయికి చేరుకుంటారు. టీహబ్‌ రెండో దశను ప్రారంభించడం అభినందనీయం. దాంతో కలిసి పనిచేస్తాం. తెలంగాణలో విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తాం’’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version