సెప్టెంబర్ 17 నుంచి రెండో విడుత ప్రజా పాలన : సీఎం రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజాపాలన నడుస్తుందని పలు సందర్భాలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే సెప్టెంబర్ 17 నుంచి దాదాపు 10 రోజుల పాటు రెండో విడుత ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడుత మాదిరిగానే దరఖాస్తులను తీసుకున్నట్టే రెండో విడుత కూడా దరఖాస్తులను స్వీకరించనున్నట్టు సమాచారం.

రెండో విడుతలో ముఖ్యంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్ కార్డులను జారీ చేయాలని క్షేత్ర స్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సూచించారు. వారి బయోడేటా మొత్తం ఒకే కార్డులో వచ్చే విధంగా రూపకల్పన చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొందరూ మొదటి విడుతలో దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. రెండో విడుతలో దరఖాస్తులు చేసుకుంటే.. వస్తాయో రావో నని పెద్ద డౌటే ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version