తెలంగాణ సచివాలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ ఇద్దరు నకిలీ ఉద్యోగులు సెక్రటేరియట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. అయితే ఆ నకిలీ ఉద్యోగులు ఎందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారో మాత్రం తెలియరాలేదు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు బయటకు రాలేదు.
అసలేం జరిగిందంటే..
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సచివాలయంలో మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమావేశం జరుగుతుండగా.. ఇద్దరు నకిలీ ఉద్యోగులు ఆరో ఫ్లోర్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే గమనించిన సెక్యూరిటీ వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. సెక్యూరిటీ వైఫల్యం వల్లే తరచూ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఇటీవల కూడా నకిలీ ఉద్యోగులు ఫేక్ ఐడీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే సమాచారం బయటకు రాకుండా సచివాలయం పోలీస్ సిబ్బంది దాచిపెడుతున్నారంటుని సమాచారం.