రాణించిన రాహుల్.. చెన్నై టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జేక్ ప్రేసర్ 5 బంతులు ఆడి డకౌట్ గా వెనుదిరిగారు. మరో ఓపెనర్ కే.ఎల్.రాహుల్ (77) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ 33 పరుగులు, కెప్టెన్ అక్షర్ పటేల్ 21, సమీర్ రిజ్వి 20 పరుగులు చేశారు. చివర్లో స్టబ్స్, కీలకంగా ఆడారు.

చివరి ఓవర్లో ఓపెనర్ కే.ఎల్.రాహుల్ ని పతిరానా వెనక్కి పంపాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అమ్మద్ 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ 1, పతిరానా 1 వికెట్ తీశారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 183 పరుగులు చేసింది. చెన్నై టార్గెట్ 184 పరుగులు. ఈ మ్యాచ్ లో చెన్నై విజయం సాధిస్తుందో.. లేక ఢిల్లీ గెలుస్తుందో తెలియాలంటే మరికొద్ది సేపు వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news