తెలంగాణ పీసీసీగా మంత్రి సీతక్క పేరు తెరపైకి వచ్చినట్లు సమచారం. తెలంగాణ పీసీసీని మార్చనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పదవి మంత్రి సీతక్కకు దక్కనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ సైతం ఆమె పేరునే హైకమాండ్‌కు సూచించనున్నట్లు సమాచారం. సీతక్కతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, పార్టీకి లాయల్‌గా ఉన్న అద్దంకి దయాకర్‌ల పేర్లు సైతం పీసీసీ రేసులో వినిపిస్తున్నాయి.
అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పీసీసీ చీఫ్ గా రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి పీసీసీ ఎవరనేదానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే పీసీసీ అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున లాబీయింగ్‌లు మొదలయ్యాయి. అధిష్ఠానం పెద్దలను ప్రసన్నం చేసుకుని, ఈ పదవిని దక్కించుకునేందుకు ముఖ్యనేతలు తమ ప్రయత్నాలు షురూ చేశారు. ఇప్పటికే పలువురు నేతలు హైకమాండ్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం.