తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒకప్పుడు ఇదే యూట్యూబ్ మీడియాను నమ్మి తప్పుడు మాటలు, తప్పుడు హామీలను చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ప్రజల గురించి, సమాజంలో ఉండే వ్యక్తుల గురించి మాట్లాడితే తప్పు పడతారు. కానీ తనను, తన కుటుంబాన్ని ఏమన్నా అంటే ఆడ, మగా అనే తేడా చూడకుండా బట్టలూడదీసి కొడతా అని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు దేనికి సంకేతం? అని ప్రశ్నించారు.
రెండు గౌరవ సభల నుంచి రేవంత్ రెడ్డి బుద్ధి, సంస్కారం ఇదని ప్రజలకు చెప్పదలుచుకున్నాడా? అని ప్రశ్నించారు సత్యవతి రాథోడ్. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏమి మాట్లాడతాడో కనీసం ఆయనకు అయినా అర్థం అవుతుందా..? అని ప్రశ్నించారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులను బట్టలు ఊడదీసి కొడతా అని అసెంబ్లీ సాక్షిగా అతి జుగుప్సాకరంగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి. భారతదేశంలో మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతామని పేర్కొన్నారు.