రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణయం.. 104 కు మంగ‌ళం

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణ‌యం తో గ్రామాల‌లో ఎక్కువ గా క‌నిపించే 104 వాహానాలు క‌నిపించ‌వు. అలాగే ఆ సేవ‌ల ను కూడా పూర్తి గా తొల‌గించింది. సంచార వైద్య సేవ‌ల‌ను పూర్తి గా తొలగిస్తున్నట్టు తాజా గా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అలాగే ఈ వ్య‌వ‌స్థ లో పని చేస్తున్న 1,250 ఉద్యోగుల‌ను ఇత‌ర రంగాల‌లో స‌ర్ధు బాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సంబంధిత అధికారుల ను ఆదేశించింది.

అయితే ప్ర‌స్తుతం హైద‌రాబాద్ మ‌హా నగ‌రం లో బ‌స్తీ ద‌వాఖాన‌ల ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. బ‌స్తీ ద‌వాఖాన వ‌లే రాష్ట్రం అన్ని గ్రామాల‌లో ప‌ల్లే ద‌వాఖాన ల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణయం తీసుకుంది. అయితే ప్ర‌తి గ్రామం లో ప‌ల్లె ద‌వాఖాన లు ఉంటే 104 వాహనాల అవ‌స‌రం ఉండ‌ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తుంది. అందుకే 104 అంబులెన్స్ సేవ‌ల‌ను తెలంగాణ లో పూర్తి గా తొల‌గించింది.

Read more RELATED
Recommended to you

Latest news