సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు

-

సూర్యాపేటలో యువకుడిని బండ రాళ్లతో మోది హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కులాంతర ప్రేమ వివాహమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు… నలుగురిపై కేసు నమోదు చేసారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (30) అలియాస్ మాల బంటి, సూర్యాపేట మండలం పిల్లలమర్రికి చెందిన నవీన్ స్నేహితులు. తరచూ నవీన్ ఇంటికి వస్తూండే కృష్ణ.. అతని సోదరి భార్గవిని ప్రేమించాడు. ఆమె విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. కులాలు వేరు కావడంతో వారు ఒప్పుకోలేదు. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో కృష్ణ, భార్గవి గత ఏడాది ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు.

కృష్ణ సూర్యాపేటలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ భార్గవితో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బైరు మహేశ్ అనే మిత్రుడి నుంచి అతనికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన కృష్ణ అదే రాత్రి హత్యకు గురయ్యాడు. భార్గవి మహేశ్ కు రాత్రి 11 గంటలకు ఫోన్ చేయగా లిప్ట్ చేయలేదు. సోమవారం ఉదయం కెనాల్ కట్టపై మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి మెడకు ఉరి వేసి చంపినట్లుగా గుర్తులు, ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణకు ఉరేసి హత్య చేసిన దుండగులు, మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు కక్ష పెంచుకున్న సోదరుడు నవీన్ ఈ హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు భార్య భార్గవి. దీంతో అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news