రాధా కిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి..!

-

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు నమోదు అవుతూనే ఉన్నాయి. దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక దాగిన వసూళ్ల దందా బట్టబయలు అవుతోంది. తాజాగా ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా బీఆర్ఎస్ ముఖ్య నేతల కనుసన్నల్లోనే జరింగిదని, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశామని, దాని ద్వారా ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసే వ్యాపారవేత్తల కార్యకలాపాలపై ఎక్కువగా దృష్టి పెట్టామని అంగీకరించినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న కొంత మంది అనుమానిత నేతలపై కూడా నిఘా పెట్టామని తెలిపారు. మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక బై పోల్ సమయంలో నిఘా పెంచామని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

2016 నుంచి ఓ వర్గానికి చెందిన అధికారులతో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నట్లు అంగీకరించారు. భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి రూ.70 లక్షలు సీజు చేసినట్లు రాధాకిషన్ రావు వెల్లడించారు. అలాగే దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘున్ రావు, ఆయన బంధువుల నుంచి రూ. కోటి, ఇక మునుగోడు బై ఎలక్షన్ టైమ్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి చెందిన రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఒప్పుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news