కాకతీయ వైద్య కళాశాల ర్యాగింగ్‌ ఘటన.. ఏడుగురు విద్యార్థులపై కఠిన చర్యలు!

-

విద్యార్థులకు ఎంత అవగాహన కల్పించినా.. ఎన్ని రకాల పటిష్ఠ చర్యలు తీసుకున్నా రాష్ట్రంలో ఇప్పటికీ పలు కళాశాలల్లో ర్యాగింగ్ భూతం పలువురి ప్రాణాలు తీస్తోంది. ర్యాగింగ్ వల్ల కొంతమంది చదువు మానేస్తుంటే.. మరికొంత మంది ఆ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల కాకతీయ వైద్య కళాశాలలో కూడా ర్యాగింగ్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఈరోజు యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సమావేశమైంది. దాదాపు ఆరు గంటల పాటు సభ్యులు విచారణ జరిపిన అనంతరం విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీన హాస్టల్‌లో ర్యాగింగ్‌ జరిగిందని నిర్థారించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ మోహన్‌ దాస్‌ తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురిపై కేసులు పెట్టామని.. ఏడాది పాటు హాస్టల్‌లో అనుమతి నిరాకరించామని.. ఏడుగురినీ మూడు నెలల పాటు సస్పెండ్‌ చేసినట్టు వెల్లడించారు.  మరో 20మంది విద్యార్థులకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. తమ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ జరగడం ఇదే తొలిసారని.. ర్యాగింగ్ ఘటనలో పోలీసుల విచారణ కొనసాగుతోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news