ఏ పార్టీ వ్యక్తుల నిర్మాణాలైనా కూల్చివేస్తాం : షబ్బీర్ అలీ

-

హైడ్రా వల్ల పేదలకు ఎటువంటి నష్టం కలగకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఏ పార్టీ వ్యక్తుల నిర్మాణాలైనా కూల్చివేస్తాం అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గతంలో కేటీఆర్ హై సెక్యూరిటీ ఏరియా అని చెప్పి డ్రోన్ ఎగరవేశాడు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని విజ్ఞప్తుల మేరకు మల్లారెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఆసవుద్దీన్ విద్యాలయలకు నోటీసులు పంపింది హైడ్రా. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది అని పేర్కొన్నారు. గత BRS ప్రభుత్వంలో అక్రమంగా నాలాలపై నిర్మాణాలు జరిగాయి అన్నారు.

అలాగే సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం. రుణమాఫీ కానీ రైతులకు త్వరలో ఇంటిట సర్వే చేసి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగేలా కృషి చేస్తాం. కామారెడ్డి మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చడానికి కౌన్సిల్ లో తీర్మానం చేయాలని సూచించిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ. కార్పొరేషన్ ద్వారా కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా వస్తాయి. త్వరలో కామారెడ్డి నియోజకవర్గం, పట్టణానికి త్రాగునీరు,సాగునీరు తీర్చడానికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ప్రత్యేక నిధుల ద్వారా సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు షబ్బీర్ అలీ.

Read more RELATED
Recommended to you

Latest news