ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇకపై మూడు గంటల ముందే ఎయిర్ పోర్టుకు రావాలని ప్రయాణికులకు సూచించింది. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే దేశీయ అలాగే అంతర్జాతీయ ప్రయాణికులు… ఇకపై… ప్రయాణ సమయానికి రెండు నుంచి మూడు గంటల కంటే ముందు చేరుకోవాలని తాజాగా… కీలక ప్రకటన చేశారు అక్కడి అధికారులు.
సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీ విపరీతంగా ఉందని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రయాణికులు విమానాశ్రయానికి విపరీతంగా వస్తున్న తరుణంలో…. రెండు నుంచి మూడు గంటల కంటే ముందే… శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాలని సూచనలు చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తనిఖీలు చేయడం కాస్త ఆలస్యం అవుతుందని… అందుకే ఈ రూల్స్ పాటించాలని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు సూచనలు చేశారు. ఈ రూల్స్ పాటించకపోతే… ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుందని వెల్లడించారు.