Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనాలకు 18 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 60,094 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 14,906 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.45 కోట్లుగా నమోదు ఐంది.
ఇక అటు తిరుమలలో అరుదైన సంఘటన కోటు చేసుకుంది. తిరుమలలో భక్తులు లేక శ్రీవారి మెట్టు మార్గం..బోసిపోయింది. చంద్రగిరి మండలం పరిధిలోని శ్రీవారి మెట్టు భక్తులు లేక వెలవెలబోయింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఉన్న వారికి మాత్రమే దర్శనం కల్పించింది టీటీడీ పాలక మండలి. టోకెన్లు తీసుకున్న భక్తులు ఘాట్ రోడ్డులోనే ప్రయాణించడంతో భక్తులు లేక ఖాళీగా కనిపించింది శ్రీవారి మెట్టు మార్గం