నేను పులి బిడ్డను..మరదలు అంటే చెప్పుతో కొడతా – షర్మిల

-

నేను పులి బిడ్డను..మరదలు అంటే చెప్పుతో కొడతానని వార్నింగ్‌ ఇచ్చారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. స్పీకర్‌ కు టీఆర్‌ఎస్‌ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై వైఎస్‌ షర్మిల ఇవాళ మీడియాతో మాట్లాడారు. నాకు భేడిలు అంటే భయం లేదు.. మీకు చేతనైతే అరెస్ట్ చేయండని సవాల్‌ చేశారు. నా పేరు వైఎస్ షర్మిల..నేను వైఎస్సార్ బిడ్డను.. గుర్తు పెట్టుకో కేసీఅర్.. నేను పులి బిడ్డను అంటూ సినిమా డైలాగులతో రెచ్చి పోయారు వైఎస్‌ షర్మిల.

వైఎస్సార్ ను కుట్ర చేసి చంపారు..నన్ను కూడా చంపగలరు.. నా గొంతు నొక్కడం మీ తరం కాదన్నారు. నన్ను ఆపడం మీ తరం కాదని.. మీతో పోలీస్ లు ఉంటే..నాతో జనం ఉన్నారన్నారు. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండని… నేను పులి బిడ్డను.. బేడి లకు భయపడే దాని కాదని వివరించారు. కేసులు పెట్టారు..కదా అరెస్ట్ చేయండి చూద్దామని… తెలంగాణ లో ఏ మహిళ నైనా అడగండి…మరదలు అంటే చెప్పుతో కొడతారా..లేదా అని ప్రశ్నించారు. ఇది నిజంగా తాలిబన్ల రాజ్యమేనని..
తెలంగాణలో ప్రజా స్వామ్యమే లేదని ఆగ్రహించారు. ఒకడు మరదలు అంటాడు…ఒకడేమో వ్రతాలు అంటాడు.. పోలీస్ శాఖ ను తెరాస లో విలీనం చేయండని చురకలు అంటించారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version